ఫ్రెష్
గా స్నానం చేసేసరికి నిద్ర వచ్చేసింది ఆమెకి.
బెడ్ మీద పడి వళ్ళెరగకుండా
నిద్ర పోయింది. రెండు సార్లు గిరి
ఆమె రూమ్ లోకి వచ్చాడు
గానీ, అక్క అలా నిద్రపోతూ
ఉండడంతో డిస్టర్బ్ చేయలేక వెళ్ళిపోయాడు. తెల్లవారుఝామున నాలుగింటికి మెలుకువ వచ్చింది ఆమెకి. కంగారుగా లేచి, పోయి తమ్ముడిని
లేపి, ఫ్రెష్ అవ్వమని చెప్పి, తనూ బాత్ రూం
లోకి దూరింది. ఇద్దరూ తయారయ్యేసరికి రిసెప్షన్ నుండి శాస్త్రి కాల్
చేసాడు. ఇద్దరూ కిందకి వెళ్ళారు. శాస్త్రి ఇద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు. అందరూ కార్ లో
బయలుదేరారు. నాలుగు వందల మైళ్ళ దూరాన్ని
ఐదు గంటల్లో చేరడం వాళ్ళకి ఆశ్చర్యంగా
థ్రిల్లింగ్ గా అనిపించింది.
వీళ్లు
వెళ్ళేసరికి అక్కడకి మిగిలిన ఆఫీస్ స్టాఫ్ చేరుకుని
ఉన్నారు. శాస్త్రి నేరుగా సుజాతని పరశురాం కొడుకు విజయ్ కి ట్రైనీ
స్టేఫ్ గా పరిచయం చేసి,
గిరిని తీసుకొని వెళ్ళిపోయాడు. అతను షేక్ హేండ్
ఇస్తూ, “అనవసరంగా మీరు ఈ ఫీల్డ్
లోకి వచ్చారు.” అన్నాడు. “అదేంటీ?” అంది సుజాత ఆశ్చర్యంగా.
“అవును, బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్తే, తప్పకుండా
మిస్ వర్ల్డ్ లేదా మిస్ యూనివర్స్
అయ్యేవారు.” అన్నాడు. ఆ కాంప్లిమెంట్ కి
సుజాత అందంగా సిగ్గుపడింది. “నేను జస్ట్ మాట
వరసకి అనడం లేదు. మీరు
సరేనంటే మన కంపెనీ తరఫునే
స్పాన్సర్ చేస్తా.” అన్నాడు. అతని మాటల్లో సీరియస్
నెస్, సిన్సియారిటీ సుజాతకు అర్ధమయింది. అతని ఆఫర్ ని
“సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు.”
అని మర్యాదగా తోసి పుచ్చింది. “ప్లీజ్,
మరోసారి ఆలోచించండి. లేకపోతే ప్రపంచం ఒక అధ్బుతమైన అందాన్ని
చూసే అవకాశం కోల్పోతుంది.” అన్నాడు. సుజాత అందంగా నవ్వేసింది.
“అదిగో, ఆ నవ్వు చాలు.”
అన్నాడు. సుజాత చేతులు జోడిస్తూ
“ప్లీజ్ సార్! నన్ను వదిలేయండి.”
అంది. అతను ఒకసారి నిట్టూర్చి,
“ఓకే, పోనీ మూవీస్ లోనైనా
ఏక్ట్ చేయొచ్చుకదా?” అన్నాడు. సుజాతకి ఏం అనాలో, ఎలా
తప్పించుకోవాలో అర్ధం కావడం లేదు.
ఆంతలో ఒక అమెరికా అమ్మాయి
వచ్చింది అక్కడకి. ఆమెకి సుజాతని పరిచయం
చేసాడు. ఆమెకూడా సుజాతని ఆరాధనగా చూస్తూ, “మీరు మీ ఫిగర్
ని అంత బాగా ఎలా
మెయిన్ టైన్ చేస్తున్నారో చెప్పండి.”
అంది వచ్చీరాని తెలుగులో. “యోగా చేస్తాను రోజూ.”
అని చెప్పింది సుజాత. “ప్లీజ్, నాకూ నేర్పుతారా, నా
ఫిగర్ పాడైపోతుందని ఇతను రోజూ తిడుతూ
ఉంటాడు.” అంది అమాయకంగా విజయ్
ని చూపిస్తూ. సుజాత నవ్వుతూ, విజయ్
తో “అదేంటీ! ఫిగర్ పాడైతే మీరు
స్టేఫ్ ని తిడతారా?” అంది
నవ్వుతూ విజయ్ తో. “స్టేఫ్
ఏంటీ? షి ఈజ్ మై
వైఫ్.” అన్నాడు. ఒక్కసారిగా షాక్ తింది సుజాత.
అదే షాక్ తో “అదేంటీ?
మీకు పెళ్ళి కాలేదని చెప్పారూ?” అంది. “ఎవరు చెప్పారూ? మా
నాన్నా? లేక ఆ శాస్త్రిగాడా?”
అన్నాడు విజయ్ నవ్వుతూ. సుజాత
అయోమయంగా చూస్తుంది. “నా పెళ్ళి అయ్యీ
వన్ ఇయర్ అవుతుంది. అమెరికా
అమ్మాయిని చేసుకోవడం నాన్నకి ఇష్టం లేదు. ఎలాగైనా
నాకు ఇండియా అమ్మాయిని ఇచ్చి చేయాలని తన
తాపత్రయం. అందుకే నిన్ను నా దగ్గరకి పంపాడు.”
అని, “నిజానికి నీ అందం చూసి
నిజంగానే షాక్ అయ్యాను.” అంటుంటే,
అతని భార్య మోచేత్తో పొడిచింది.
వెంటనే విజయ్ సుజాతతో “బట్,
ఈ అమ్మాయిని లవ్ చేసేసాను, ఏం
చేయనూ, బేడ్ లక్.” అన్నాడు
నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతుంది.
సుజాత కూడా నవ్వుతూ “షి
ఈజ్ క్యూట్.” అంది. అతను నవ్వుతూ,
తన భార్యను దగ్గరకు లాక్కొని, “అందుకేగా పెళ్ళి చేసుకుంది.” అన్నాడు. సుజాత నవ్వేసి, “ఓకే,
గుడ్ లక్.” అని వెళ్ళబోయింది.
“వన్ మినిట్.” అన్నాడు అతను. సుజాత ఆగింది.
“నేను చెప్పింది సీరియస్ గా ఆలోచించండి.” అన్నాడు.
“ఏమిటీ?” అంది. “అదే మిస్ యూనివర్స్.”
అన్నాడు. “సారీ సార్. నిజంగా
నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎనీ హౌ,
థేంక్స్ ఫర్ యువర్ ఆఫర్
అండ్ కాంప్లిమెంట్.” అని వెళ్ళిపోయింది.
అక్కడనుండి
హోటల్ కి వచ్చాకా, జరిగింది
విని పగలబడి నవ్వుతూ “పాపం, పరశురాం ముచ్చట
తీరదన్న మాట.” అన్నాడు గిరి.
సుజాత కూడా నవ్వేస్తూ, “ఇక
సామాను సర్ధు, ఫ్లైట్ కి టైం అవుతుంది.”
అంది. “మొత్తానికి పరశురాం ఖర్చుతో విదేశాలు చూసేసాం. అతని రుణం ఎలా
తీరుతుందో.” అంటూ, లేచాడు గిరి.
మొత్తానికి అక్కడ నుండి ఇండియాకి
నెక్స్ట్ డే చేరారు. ఒకరోజు
రెస్ట్ తీసుకొని, పరశురాంని కలిసి జరిగింది చెప్పింది
సుజాత. అతను నిట్టూర్చి, “నిన్ను
చూసాకైనా మనసు మార్చుకుంటారనుకున్నాను. ఓకే..” అన్నాడు
బాధగా. సుజాత “సారీ సార్.” అని,
వెళ్ళబోతుంటే, “ఒక్క విషయమమ్మా..” అన్నాడు.
సుజాత ఏమిటన్నట్టు చూసింది. “నిన్ను నా కోడలిగా చేసుకుందామనుకున్నాను.
కుదరలేదు. నువ్వు నా ఎదురుగా ఉంటే,
నాకు కాస్త గిల్టీగా ఉంటుంది.”
అన్నాడు. సుజాత ఒకసారి అతని
వైపు సూటిగా చూసి, “ఓకే సార్, రిజైన్
చేస్తాను.” అంది. అతను కంగారుగా
“నా ఉద్దేశ్యం అది కాదు. ముంబయ్
లో నాకు వేరే కంపెనీ
ఉంది. నేను సాధారణంగా అక్కడకి
రాను. నీకు శాలరీ ట్రిపుల్
చేస్తాను. అక్కడకి వెళ్ళిపో.” అన్నాడు. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే, వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ మంచి శాలరీ అని అందరినీ ఒప్పించి, ముంబయ్ కి చేరింది.... . ..(Written by Mango Shilpa — To be continued in Part-40)
Post a Comment